NRPT: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని జిల్లా డీఎస్పీ లింగయ్య పిలుపునిచ్చారు. సీఎం కప్ 2025-26 క్రీడల నేపథ్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ శివారెడ్డితో కలిసి ఆయన టార్చ్ ర్యాలీని ప్రారంభించారు. క్రీడాకారులు క్రమశిక్షణతో ఆడి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.