NRPT: ఊట్కూర్ మండల కేంద్రంలోని హకా కేంద్రంలో యూరియా రైతులకు సరిపడా అందుబాటులో ఉందని ఏఈవో గణేష్ రెడ్డి తెలిపారు. గతంలో యూరియా కేవలం ఆగ్రోస్ కేంద్రంలో మాత్రమే లభించేదని, ఇప్పుడు హకా ద్వారా కూడా సరఫరా చేయడంతో రైతులకు సౌలభ్యం కలిగిందన్నారు. అవసరమైన రైతులు సంబంధిత పత్రాలతో హకా కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.