VSP: మహిళల భద్రత కోసం విశాఖలో ‘సఖి’ వన్ స్టాప్ సెంటర్ వాహనాన్ని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ప్రారంభించారు. అత్యవసర సమయాల్లో మహిళలకు అండగా నిలిచేందుకు ఈ మొబైల్ యూనిట్ అందుబాటులోకి వచ్చిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.