వెనిజులాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. తక్షణమే చైనా, రష్యా, ఇరాన్, క్యూబాతో ఆర్థిక సంబంధాలు తెంచుకోవాలంటూ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీని హెచ్చరించారు. అలాగే చమురు ఉత్పత్తిలో అమెరికాతో భాగస్వామిగా ఉండటానికి అంగీకరించాలన్నారు. 30 మిలియన్ల నుంచి 50 మిలియన్ల బ్యారెళ్ల చమురును USకు అప్పగించాలని చెప్పారు. వీటి ధరను తామే నియంత్రిస్తామని తెలిపారు.