అన్నమయ్య: జిల్లా హెడ్‌క్వార్టర్‌ను మదనపల్లికి మార్చిన నిర్ణయంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. 2022లో రాయచోటిని జిల్లా కేంద్రంగా నిర్ణయించి కారణం లేకుండా మార్పు చేశారని పిటిషనర్ వాదించారు. అయితే మదనపల్లి మెరుగైనదిగా భావించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.