GDWL: జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ నుంచి వనపర్తికి బయలుదేరిన ఆర్టీసీ బస్సు సాంకేతిక లోపంతో జిల్లా కలెక్టరేట్ సమీపంలో మంగళవారం నిలిచిపోయింది. దాదాపు 30 నిమిషాలు ప్రత్యామ్నాయ బస్సు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నారులు, వృద్ధులు రోడ్డుపైనే ఎదురుచూడాల్సి రావడం ఆవేదన కలిగించింది.