PDPL: ధర్మారం మండల కేంద్రంలోని హరిహరసుత శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఇవాళ గోశాలలో ఛైర్మన్ తాటిపల్లి ఈశ్వర్ ఆధ్వర్యంలో గోపూజ నిర్వహించారు. భక్తులు గోమాతను పసుపు కుంకుమలతో అలంకరించి గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పూజలు చేశారు. ఆలయ పూజారి నర్సింగరావు, అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు.