SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలోని సాకీ చెరువు కింద ఆయకట్టు దారుల రబీ పంటలకు బుధవారం స్థానిక సర్పంచ్ శ్రీనివాసరావు పాటిల్ తూము ద్వారా నీటిని విడుదల చేశారు. గత వారం రైతులతో జరిగిన సమావేశంలో తీర్మానించిన ప్రకారంగా చెరువు కింద రబీ వరి పంట సాగుకు నీటిని వదిలామని సర్పంచ్ తెలిపారు. రైతులు నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు.