విశాఖ వైసీపీ జిల్లా కార్యాలయంలో సమీక్షా సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కేకే రాజు వార్డు, జిల్లా కమిటీల నియామకాలను త్వరగా పూర్తి చేయాలని నాయకూలను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో 7,000 మందితో కమిటీలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.