W.G: భీమవరంలో అభివృద్ధి పనులతో పాటు సుందరీకరణ పనులు కూడా ఎన్నో జరుగుతున్నాయని, వాటిలో భాగంగా ఇటువంటి వినోదాన్ని పంచే బోట్ షికార్ను ప్రారంభించుకుంటున్నామని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ఎడ్వర్డ్ ట్యాంక్ వద్ద సుమారు రూ. 5 లక్షలతో ఏర్పాటు చేసిన బోట్ షికార్ను బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.