ADB: విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. నిన్న ఆదిలాబాద్‌లోని ఎస్సీ వసతి గృహంలో వాటర్ ప్లాంట్, గ్రీసర్లను ప్రారంభించి బ్లాంకెట్లను పంపిణీ చేశారు. చదువుపై శ్రద్ధ వహించి, పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించేలా ప్రోత్సహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.