KMR: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర హాల్టికెట్లను బోర్డు విడుదల చేసినట్లు కామారెడ్డి జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి షేక్ సలాం తెలిపారు. విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. హాల్టికెట్లలో ఏవైనా తప్పులుంటే వెంటనే సంబంధిత కళాశాలల ప్రిన్సిపల్ను సంప్రదించాలని సూచించారు.