ఆదిలాబాద్ బీసీ స్టడీ సర్కిల్లో సావిత్రిబాయి ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుల, లింగ వివక్షలకు వ్యతిరేకంగా పోరాడి, మహిళలు, అట్టడుగు వర్గాల విద్యా, సామాజిక హక్కుల కోసం జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. ఇందులో భాగంగా విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.