ELR: అప్పన్నవీడులో జరిగిన రెడ్డి జ్యోతి హత్య కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్సై శారద సతీశ్ శనివారం తెలిపారు. భర్త అనిల్ కుమార్ వివాహేతర సంబంధం విషయంలో భార్యతో తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో ప్రియురాలు పాకలపాటి జ్యోతితో కలిసి భార్యను గత ఏడాది డిసెంబర్ నెల 23న హత్య చేశాడు. నిందితులిద్దరినీ ప్రియురాలి నివాసం వద్ద అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు.