AP: ఎన్నికల హామీల్లో భాగంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం జగన్ ఫొటో ముద్రణకు రూ.630 కోట్లు ఖర్చు పెట్టిందని, ట్రూఅప్ ఛార్జీల మోత మోగించిందని ఆరోపించారు. కూటమి సర్కారు వచ్చాక ట్రూఅప్ ఛార్జీలను రద్దు చేసిందని తెలిపారు. అంతకుముందు మంత్రి రెవెన్యూ సదస్సులో పాల్గొని రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు.