SKLM: మహిళా అభ్యున్నతికి మార్గదర్శి సావిత్రిబాయి పూలే అని ఎమ్మెల్యే ఈశ్వరరావు అన్నారు. ఇవాళ JRపురం హైస్కూల్లో జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంలో టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీనివాసులు నాయుడుతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులను సన్మానం చేశారు.