SRD: శీతాకాలం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. నియోజకవర్గంలో భూమి పరీక్షలు చేసే ల్యాబ్‌ను ఏర్పాటు చేసి, రైతులకు నూతన పద్ధతిలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసే విధంగా పాటుపడాలన్నారు. అలాగే దానితోపాటు సేంద్రీయ వ్యవసాయానికి ప్రభుత్వం పూర్తిగా సహకరించాలని తెలిపారు.