VSP: ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా పాత్ర కీలకమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. శనివారం స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఆయనను కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం అసోసియేషన్ సేవలను ప్రశంసించారు.