పాకిస్తాన్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే ఆరోపణలతో నలుగురు జర్నలిస్టులకు అక్కడి కోర్టు జీవిత ఖైదు విధించింది. ప్రభుత్వం, ఆర్మీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారన్న కారణంతో ఈ కఠిన శిక్ష వేసినట్లు తెలుస్తోంది. ఈ తీర్పుపై జర్నలిస్ట్ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.