VZM: రాజం మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు ఇవాళ పట్టణంలో పలు వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్యం, నీటి సరఫరా తదితర వివరాలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని, కాల్వలను శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి ఆదేశించారు. ప్రజలు కూడా బాధ్యతగా చెత్తను రోడ్లపై, కాలువలో వేయకుండా మున్సిపల్ కార్మికులకు అందించాలన్నారు.