ADB: చించోలి ఎక్స్‌రోడ్ సమీపంలోని ఎంజేపీ డిగ్రీ కళాశాలలో ఇవాళ సావిత్రిబాయి ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. అధ్యాపకులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రిన్సిపల్ విజయ్ మాట్లాడుతూ.. మహిళల విద్య, సామాజిక సమానత్వం కోసం సావిత్రిబాయి చేసిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు. ఆమె ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.