MDCL: రామంతపూర్ డిడి కాలనీ ప్రాంతాల్లో ఆధార్ అప్డేట్ కోసం క్యూ లైన్లలో నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, రోజు కేవలం 50 మందికి మాత్రమే టోకెన్లు ఇస్తున్నట్లు అక్కడి ప్రజలు వాపోయారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే సేవలు అందిస్తామని అనడం ఏంటని..? ఆధార్ సేవ ఉన్నతాధికారులను అక్కడికి వచ్చిన ప్రజలు ప్రశ్నించారు.