WGL: సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని పర్వతగిరి ఎంపీడీవో మాలోత్ శంకర్ నాయక్ అన్నారు. శనివారం పర్వతగిరి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా స్వేరోస్ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయుల సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.