ప్రకాశం: పెద్ద చెర్లోపల్లి ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా మంజూరైన బ్యాటరీ ఆటోను కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… స్వచ్ఛతకు ప్రజలు సహకరించాలని, గ్రామ పరిశుభ్రతకు బ్యాటరీ ఆటో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.