రష్యా నుంచి చమురు దిగుమతులపై కేంద్రం దృష్టి సారించింది. కొనుగోళ్లకు సంబంధించి వారాంతపు డేటా ఇవ్వాలని భారత రిఫైనరీలను కోరినట్లు సమాచారం. అమెరికాలో త్వరలో జరగనున్న చమురు ఒప్పందం నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు ఆంగ్ల మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.