PDPL: హిమాచల్ ప్రదేశ్‌లో ఈనెల 5 నుంచి 9 వరకు జరగనున్న పాఠశాల క్రీడా సమాఖ్య అండర్ 14 బాలుర వాలీబాల్ జాతీయ జట్టు మేనేజర్‌గా ధర్మారం తెలంగాణ మోడల్ స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయుడు బైకని కొమురయ్య ఎంపికైనట్లు తెలంగాణ కార్యదర్శి ఉషారాణి, జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ తెలిపారు. ఈ సందర్భంగా కొమురయ్యను మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.