NLR: సూళ్లూరుపేట చెంగాళమ్మను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి దంపతులు శనివారం దర్శించుకున్నారు. చండీయాగంలో పాల్గొని వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో జరిగే నిత్యాన్నదానానికి రూ.6 లక్షలు విరాళం అందజేశారు. ఈ చెక్కును ఆలయ సహాయ కార్యదర్శి ప్రసన్నలక్ష్మీకి అందజేశారు.