అన్నమయ్య: చిట్వేలు మండలంలోని జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం ‘మెగా జనసేన క్యాలెండర్’ను జనసేన నాయకులు తాతంశెట్టి నాగేంద్ర, మాదాసు నరసింహ ఘనంగా ఆవిష్కరించారు. కడప జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో రూపొందించిన ఈ క్యాలెండర్ జనసేన ఆశయాలు, సిద్ధాంతాలను ప్రతిబింబిస్తుందని, మెగా కుటుంబంపై అభిమానాన్ని, జనసేన పార్టీ పట్ల నిబద్ధతను చాటే విధంగా ఉందని నేతలు తెలిపారు.