TG: అసెంబ్లీ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. HYD బషీర్ బాగ్ నుంచి అసెంబ్లీకి BJP ఎమ్మెల్యే పాయల్ శంకర్ ర్యాలీ నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లాలోని కొరాటా చనాకా ప్రాజెక్టు బాధిత రైతులతో కలిసి ర్యాలీ చేశారు. ఈ క్రమంలో అసెంబ్లీ దగ్గర రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ప్రాజెక్టుకు రైతులు భూములిచ్చి 8-9 ఏళ్లైనా ఇప్పటివరకు పరిహారం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.