SRD: విశాఖపట్నంలో జరుగుతున్న సీఐటీయు అఖిలభారత మహాసభలకు సంగారెడ్డి పట్టణం నుంచి కార్మికులు శనివారం తరలి వెళ్లారు. జిల్లా ఉపాధ్యక్షుడు బాగ రెడ్డి మాట్లాడుతూ.. సంగారెడ్డి నుంచి కార్మికులు భారీ సంఖ్యలో విశాఖపట్నంలో జరిగే బహిరంగ సభకు తరలి వెళ్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రసన్న, మల్లారెడ్డి, విక్టర్, విష్ణు పాల్గొన్నారు.