ఒకసారి సృష్టికర్త బ్రహ్మదేవుడికి, సృష్టిని పాలించే విష్ణుమూర్తికి మధ్య ఎవరు గొప్ప అనే విషయంలో తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఈ క్రమంలో లింగం భూమిపై ఆవిర్భవించింది. దాని ఆది, అంతం కనుగొనడానికి వారు ప్రయత్నించినా.. అది సాధ్యం కాలేదు. వారు అలా వెతుకుతుండగా, ఆ అగ్నిస్తంభం మధ్యభాగం నుంచి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు సృష్టి, స్థితి, లయలకు తానే మూలమని శివుడు వెల్లడించాడు.