W.G: ఈనెల 13 నుంచి ప్రారంభమయ్యే భీమవరం మావుళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సీసీ కెమెరాలు, పార్కింగ్ స్థలాలు, హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేయాలలన్నారు.