ఉత్తరాది తరహాలో కేరళలోనూ కుంభమేళా నిర్వహించాలని జునా అఖారా నిర్ణయించింది. మలప్పురంలోని భారతపుళ నదీ తీరంలో ఈనెల 18 నుంచి ఫిబ్రవరి 3 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. చేరమాన్ పెరుమాళ్ కాలం నాటి ‘మహామఖం’ ఉత్సవ స్ఫూర్తితో దీనిని పునరుద్ధరిస్తున్నారు. ఇందులో కేరళలోని అన్ని ఆశ్రమాలు, మఠాధిపతులు పాల్గొంటారని జునా అఖారా మహామండలేశ్వర్ స్వామి ఆనందవనం భారతి తెలిపారు.