నేపాల్లో పెను విమాన ప్రమాదం త్రుటిలో తప్పింది. ల్యాండింగ్ సమయంలో ఓ విమానం అదుపు తప్పి రన్వే పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటన జరిగినప్పుడు విమానంలో 55 మంది ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తు వారంతా సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రన్వే జారిపోవడమే దీనికి కారణమని ప్రాథమిక సమాచారం.