VSP: జిల్లాలో వీధి కుక్కల స్వైర విహారంతో కుక్కకాటు బాధితుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. గత ఏడాది జనవరి నుంచి డిసెంబరు వరకు 20,599 మంది కుక్కకాటుకు గురైనట్లు ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. అధికారిక లెక్కలకన్నా వాస్తవ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిరోజూ నగరంలో కనీసం పది మంది కుక్క కాటుకు గురువుతున్నారు.