MLG: మున్సిపాలిటీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ కార్యకర్తలు సన్నద్ధంగా ఉండాలని ములుగు మండల పార్టీ అధ్యక్షుడు రమేష్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరు గ్యారెంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సమావేశంలో టౌన్ ప్రెసిడెంట్ విజయ్, గోవింద్ నాయక్, భవాని, బిక్షపతి, మహేష్ పాల్గొన్నారు.