ATP: యల్లనూరులో వైసీపీ జెడ్పీటీసీ సభ్యుడు భోగతి విజయప్రతాప్ రెడ్డిపై టీడీపీ వర్గీయుల హత్యాయత్నం దారుణమని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. ఈ తరహా దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులతో వైసీపీ నేతలను, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టడం ఎంత మాత్రం సరికాదని హెచ్చరించారు. బాధితుడి తండ్రితో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు.