NZB: జిల్లాలోని పేద పద్మశాలి యువతులకు సంఘం తరపున ఉచితంగా పెళ్లిళ్లు చేయనున్నట్లు అఖిల భారత పద్మశాలి సంఘం సెంట్రల్ కమిటీ సభ్యులు నర్సింలు పేర్కొన్నారు. జిల్లా పద్మశాలి సంఘం నాయకులను నూతనంగా ఎన్నికైన జిల్లా మహిళా పద్మశాలి సంఘం ప్రతినిధులు శనివారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా పద్మశాలి సంఘం అధ్యక్షురాలు చాట్ల అన్నపూర్ణ ఉన్నారు.