PLD: జిల్లాలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి మంజూరైన 20 రైల్వే బ్రిడ్జిల (ROB, RUB) పనులను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ కృత్తికా శుక్ల అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన సమీక్షలో భూసేకరణ పూర్తి చేసి, రైతులకు పరిహారం వెంటనే చెల్లించాలని సూచించారు. అనుమతులు ఉన్న చోట పనులు ఆలస్యం కాకుండా వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.