JGL: వసతి గృహాల్లో విద్యార్థుల పట్ల బాధ్యతాయుతంగా, పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని జగిత్యాల జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కే. రాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కార్యాలయంలో షెడ్యూల్డ్ కులాల వసతి గృహ ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగుల సంఘం-2026 క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. విద్యార్థుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.