దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. దుండగులు ఓ వ్యాపారి కారుపై ఏకంగా 12 రౌండ్ల కాల్పులు జరిపారు. అంతర్జాతీయ నంబర్ నుంచి ఫోన్ చేసి తనను రూ.3 కోట్లు డిమాండ్ చేశారని బాధితుడు పోలీసులకు తెలిపారు. అదృష్టవశాత్తు ఈ కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.