MDK: నర్సాపూర్ మండలంలో ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది. రుస్తుంపేట గ్రామానికి చెందిన ఎరుకలి చిన్న పోచయ్య భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయారు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో, బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.