ELR: దెందులూరు మండలం పోతునూరులో రొయ్యల చెరువుల వద్ద కాపలాదారుగా పనిచేస్తున్న సత్తనపల్లి రవి (33) శుక్రవారం ఆక్వా మందు బిళ్లలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. భీమడోలు మండలం వడ్డీగూడెంకు చెందిన రవిని చికిత్స కోసం ఏలూరు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.