BDK: కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఈ నెల 6 నుంచి ‘సదరం’ వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ విద్యాచందన ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 16 విభాగాలకు సంబంధించి ఈ నెల 6, 9, 20, 23, 27 తేదీల్లో 5 రోజులపాటు ఈ క్యాంపులు జరుగుతాయని వివరించారు. దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.