గుంటూరు ఏటుకూరు రోడ్డులో సింగిల్ నంబర్ లాటరీ నిర్వహిస్తున్న నలుగురిని లాలాపేట పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 19 లాటరీ పుస్తకాలు, నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందాల్ స్పందిస్తూ.. లాటరీ, బెట్టింగ్, కోడిపందేలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.