AKP: ప్రభుత్వ పెన్షనర్లు వచ్చే నెల 28వ తేదీలోగా లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించాలని జిల్లా ఖజానా అధికారిణి వి.ఎల్.సుభాషిణి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జీవన ప్రమాణ యాప్, పోస్ట్ ఆఫీస్, సబ్ ట్రెజరీ ద్వారా లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించాలని కోరారు. అనారోగ్య కారణాల వల్ల రాలేని పెన్షనర్లు సంబంధిత అధికారులకు సమాచారం అందిస్తే వారు వచ్చి స్వయంగా నమోదు చేస్తారని అన్నారు.