VZM: రైతన్నల భూ సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి పేర్కొన్నారు. శుక్రవారం భోగాపురం మండలం నందిగాం పంచాయతీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని, రైతులకు పుస్తకాలను అందజేశారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.