ELR: ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో జిల్లా యంత్రాంగం మంచి ప్రగతిని సాధించిందని కలెక్టర్ నాగరాణి అభినందించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన వార్షిక సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్తమ ఫలితాలు నమోదు చేశారని కొనియాడారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో పనిచేయాలని అన్నారు.