MBNR: జిల్లా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి పాలమూరును అభివృద్ధి పథంలో ముందంజలో ఉంచాలని కలెక్టర్ విజయేందిర బోయి పిలుపునిచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మధుసూదన్ నాయక్ సహా వివిధ శాఖల అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది పరస్పర సహకారంతో జిల్లాకు మంచి పేరు తీసుకోరావాలన్నారు.