VZM: ఈనెల 12 నాటికి ఫ్యామిలీ సర్వేను పూర్తి చేయాలని వేపాడ మండల స్పెషల్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ ఆదేశించారు. శుక్రవారం స్దానిక MRO రాములమ్మ, MPDO సీహెచ్ సూర్యనారాయణతో కలసి వేపాడలో జరుగుతున్న ఫ్యామిలీ సర్వేను పరిశీలించారు. ఈ సర్వేలో కుటుంబానికి సంబంధించిన సమగ్ర వివరాలను పొందుపరచాలని పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసరావుకు సూచించారు.